- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం నిల్వ చేయకుండా వెంట వెంటనే పంపించాలి: కలెక్టర్
ధాన్యం కాంట వేయడంతోనే ఎప్పటికప్పుడు నిల్వ ఉంచకుండా గోదాములకు పంపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ అన్నారు.

దిశ, కోహెడ: ధాన్యం కాంట వేయడంతోనే ఎప్పటికప్పుడు నిల్వ ఉంచకుండా గోదాములకు పంపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల ఐకెపి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ లోడ్ చేసిన వరి ధాన్యం శ్రీ లక్ష్మీ రైస్ మిల్- తోటపల్లి కి పంపించామని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం గ్రేడ్ విషయంలో సమస్యలు ఉన్నందున పరిష్కరించాలని రైతులు కోరగా అగ్రికల్చర్ అధికారులు వచ్చి ధాన్యం అంత పరిశీలన చేసి గ్రేడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సెంటర్ లో తాగునీటి వసతి, కంఠాల, తాలు తీసే యంత్రాలు, గన్ని బ్యాగులు, సుతిల్ దారాలు ప్రతిదీ ఉండేలా చూసుకోవాలని, ధాన్యం తేమ శాతం వచ్చాక తాలు తీసాకే లోడ్ చేయించాలని సిబ్బందికి తెలిపారు.అలాగే రైతులు రాత్రి వేళలో ధాన్యం పైన టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని అకాల వర్షాలు పడే ఆస్కారం ఉందని సూచించారు.






