ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
X

దిశ,కొల్చారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో తుక్కాపూర్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం రాశులు పేరుకుపోయాయని ఎమ్మెల్యే అన్నారు. హమాలీలు, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు వేగవంతం గా సాగడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకొని లారీల సమస్య పరిష్కరించాలని తూకం వేసిన ధాన్యం ఈ రోజు కా రోజు నిలుపు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రతిసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీల సమస్య తలెత్తుతున్నప్పటికీ సమస్య పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి అయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని తూకం విషయంలో రైతులు మోసపోకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ సర్పంచ్ దొడ్లే అంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, డిసిఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు అరిగె రమేష్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రవితేజ రెడ్డి, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story