ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

by Taduka Kalyani |

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
X

దిశ, పాపన్నపేట : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల పరిధిలోని పొడిచన్ పల్లి గ్రామంలో మత్స్యకార సంఘ సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ప్రారంభించి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story