- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం : టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు.

దిశ, సదాశివపేట : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ముబారక్పూర్ స్వరూప ప్రభు ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం టీజీఐఐసీ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ..పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే, తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ముబారక్పూర్ స్వరూప మాట్లాడుతూ సొంత ఇల్లును కట్టుకుంటామని తాము కలలో కూడా ఊహించలేకపోయామని, తమ ఆనంద భాష్పాల ద్వారా నిర్మలా జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్, సర్పంచులు మాచిరెడ్డిపల్లి మోహన్ గౌడ్, కంబాలపల్లి సర్పంచ్ ఇందూరిబాబు, నిజాంపూర్ సర్పంచ్ సత్యనారాయణ, కోల్కూర్ నాయకులు మాణిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ధనరాజ్, వార్డు సభ్యులు సాబీర్, సందీప్, రమేష్, చంద్రమౌళి పాల్గొన్నారు.






