- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్లుగా వ్యవసాయం పేరిట ప్రభుత్వ భూమి కబ్జా
సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కంది మండల కేంద్రం అభివృద్ధిలో రోజురోజుకు ముందుకు దూసుకుపోతుంది. ఇక్కడ భూముల ధరలు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాయి.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కంది మండల కేంద్రం అభివృద్ధిలో రోజురోజుకు ముందుకు దూసుకుపోతుంది. ఇక్కడ భూముల ధరలు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాయి. ప్రస్తుతం ఇక్కడ రోడ్డుకు దగ్గరగా ఉన్న భూమిలో ఎకరం స్థలం రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. దీనిని అదునుగా చేసుకొని కొందరు కబ్జారాయుళ్లు ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఎసరు పెట్టారు. పైకేమో వ్యవసాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూనే కోట్ల రూపాయల భూమిని తమ కబ్జాలోకి తీసుకున్న ఉదంతం తాజాగా బయటపడింది. కంది మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 616లో 52.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
అయితే ఇదే సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఐఐటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన భూ బాధితులకు ప్లాట్లుగా చేసి వారికి ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ భూమిలో నుంచే రిలయన్స్ ప్రైవేటు సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ వెళుతుంది. అయితే గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే బూడిద కుమార్ అనే వ్యక్తి ఈ ప్రభుత్వ భూమిలోని 2.10 ఎకరాలను తన కబ్జాలోకి తీసుకున్నాడు. పైకేమో వ్యవసాయం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూనే దానిని తన సొంతం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కాగా గతంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ... ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జాకి గురైనట్లు తమ దృష్టికి వస్తే వెంటనే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో బుధవారం కంది తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన రూ.12 కోట్ల విలువ గల 2.10 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా చేదును చేసి రెవెన్యూ అధికారులు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ నోటీసు బోర్డును పెట్టారు. కబ్జాకు ప్రయత్నించిన ప్రైవేటు వ్యక్తి అయినా బూడిద కుమార్ ను రెవెన్యూ అధికారులు ఇదేమిటని ప్రశ్నించగా రిలయన్స్ సంస్థ తమకు వ్యవసాయం కోసం ఇచ్చిందంటూ చెప్పినట్లు ఎమ్మార్వో తెలిపారు. ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూసిన, కబ్జా చేయాలని చూసినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.






