- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలంలో 183 కుంటలు, 30 చెరువులకు జియో ట్యాగ్ పర్మిషన్
చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ అంబారెడ్డి చెరువును విట్ల్యాండ్ సర్వేలో భాగంగా మండలంలో 183 చెరువు కుంటలకు 30 చెరువులకు మాత్రమే జియో ట్యాగ్ పర్మిషన్ వచ్చిందని తహశీల్దార్ మాలతీ బుధవారం సర్వేలో భాగంగా ఖాజాపూర్ లో తెలిపారు.

దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ అంబారెడ్డి చెరువును విట్ల్యాండ్ సర్వేలో భాగంగా మండలంలో 183 చెరువు కుంటలకు 30 చెరువులకు మాత్రమే జియో ట్యాగ్ పర్మిషన్ వచ్చిందని తహశీల్దార్ మాలతీ బుధవారం సర్వేలో భాగంగా ఖాజాపూర్ లో తెలిపారు. ఒక చెరువును జియో ట్యాగ్ చేస్తారని దీనికి FTL ఫిక్స్ చేస్తారన్నారు. అందుకే వీటిలో భాగంగా అంబారెడ్డి చెరువు సర్వే చేస్తున్నామని పక్కనే గల కావేరి పరిశ్రమ వారికి చెప్పడం జరిగిందని, పక్కనే ఉన్న మట్టిని వారం రోజుల్లో లేదా 15 రోజుల్లో తీసివేయాలని పరిశ్రమ యజమానికి తెలిపినట్లు వివరించారు. స్పందించకపోతే నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతీ, ఫారెస్ట్ ఏఈ వాసుదేవ్, సర్వే లక్ష్మి భవాని, రెవెన్యూ అధికారులు వినయ్, రాజు, ఎమ్మార్వో రెవెన్యూ సర్వేర్ కావేరి పరిశ్రమ యాజమాన్యం సర్పంచ్ మన్నే బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, ఖాజాపూర్ తాండ సర్పంచ్ పియా నాయక్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.






