గౌరి పోరాటం సుఖాంతం

by Ratna Kumari |

భర్త కోసం 9 నెలల బాలుడిని వెంట పెట్టుకొని గౌరి చేసిన పోరాటం ఫలించింది. భార్య భర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వివాదం పరిష్కరించడంతో కథ సుఖాంతం అయింది.

గౌరి పోరాటం సుఖాంతం
X

దిశ, ములుగు : భర్త కోసం 9 నెలల బాలుడిని వెంట పెట్టుకొని గౌరి చేసిన పోరాటం ఫలించింది. భార్య భర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వివాదం పరిష్కరించడంతో కథ సుఖాంతం అయింది. వివరాల్లోకి వెళ్లితే... సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న గౌరి, అవినాష్ రెడ్డి మధ్య కుటుంబ విభేదాలు తలెత్తడంతో గౌరి తన 9 నెలల బాలుడితో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ ఘటన పై స్పందించిన మర్కూక్ ఎస్సై దామోదర్ కుటుంబ సభ్యులను గ్రామంలో గౌరీ అత్తగారి ఇంటి వద్ద ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు సహజమని, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని వారికి సూచించారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబ బంధాలను కాపాడుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం భర్త అవినాష్ రెడ్డి, భార్య గౌరిని కలిసి ఉండేందుకు అంగీకరించగా, అత్తమామలకు కూడా తగిన సూచనలు చేశారు. గురువారం దిశ దినపత్రికలో ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.. బాలుడి జన్మనిచ్చాక మొఖం చాటేశాడు పేరిట కథనం ప్రచురితమైంది.

Next Story