అంతర్ జిల్లా బ్యాటరీ దొంగల ముఠా అరెస్ట్

by Ratna Kumari |

దిశ, కొండపాక : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు సంవ‌త్స‌రాలుగా ప‌లు వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్నఅంతర్-జిల్లా ముఠా గుట్టును కుకునూర్ పల్లి పోలీసులు రట్టు చేశారు. గురువారం

అంతర్ జిల్లా బ్యాటరీ దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, కొండపాక : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు సంవ‌త్స‌రాలుగా ప‌లు వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్నఅంతర్-జిల్లా ముఠా గుట్టును కుకునూర్ పల్లి పోలీసులు రట్టు చేశారు. గురువారం కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేక‌ర్ల సమావేశం లో గజ్వేల్ ఏసీపీ కె. నర్సింహులు తొగుట సీఐ లతీఫ్, కుకునూర్ పల్లి ఎస్ఐ పి శ్రీనివాస్ ల తో కలిసి వివ‌రాలు వెల్లడించారు. హైద‌రాబాద్ కి చెందిన రహిమ్ , రిషబ్ లు, జగిత్యాలకు చెందిన నరసింహలు ముగ్గురు స్నేహితులు. జల్సాలకు అలావాటు పడి వీరు పని చేస్తున్న డబ్బులు సరిపోకపోవండతో ఎలాగైనా డబ్బులు సంపాందిచాల‌నే ఉద్దేశంతో వీరు ప్లాన్ వేశారు. రహీమ్ ఇంటి వద్ద బహదూర్ పూరలో మినాజ్ కు వ‌ర్క్ షాప్ కలదు. అయితే చాలా మంది వివిధ‌ రకాల వాహనాల బ్యాటరీ లు అమ్ముతుంటే గమనించేవాడు. అత‌ని స్నేహితుడు నర్సింహులు సిద్దిపేట లో పనిచేస్తాడు.


తెలిసిన ప్రాంతాల్లో దొంగ తనం చేస్తే తొందరగా దోరుకుతం అని తెలియని ప్రదేశంలో బ్యాటరిలు దొంగ‌త‌నం చేస్తే ఎవరు గుర్తు పట్టరని ప‌లు బ్యాట‌రీల దొంగిలించేవారు. బ్యాటరీలు దొంగతనం చేసి హైదరాబాద్ చెందిన మినాజ్ వద్ద కు వెళ్లి బ్యాటరిలు దొంగ‌త‌నం చేశామ‌ని తెల‌ప‌గా.. మినాజ్ కి తెలిసిన దొంగ బ్యాట‌రీలు కొనే షాపు ఉంద‌ని.. అది న‌డిపిస్తున్న మ‌క్సూద్, అల్తాప్ ల‌ను ప‌రిచ‌యం చేశాడు. వారు ముఠాగా ఏర్ప‌డి తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో బ్యాట‌రీలు దొంగ‌త‌నం చేసి అమ్మి సొమ్ము చేసుకునే వారు. గురువారం కుకునూర్ పల్లి పోలీసులు కుకునూర్ పల్లి మండలం కేంద్రంలోని ముద్దపూర్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా అనుమానం వచ్చి పట్టుకోని విచారించగా బ్యాటరీలు దొంగతనం చేసిన‌ట్టు అంగీక‌రించారు. పోలీసులు వారి వద్ద నుంచి 40 బ్యాటరీలు (రూ. 1.97 లక్షలు), రూ. 6.39 లక్షల నగదుతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్ జిల్లా బ్యాటరీ దొంగలు ముఠాలో 4 గురిని అరెస్టు చేశామ‌ని.. మరో ఇద్దరు పరారీలో ఉన్న‌ట్టు ఏసీపీ తెలిపారు.

Next Story