క్రషర్ మిల్లుల్లో భారీ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

by Kodari Anjali |

క్రషర్ మిల్లుల్లో భారీ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

క్రషర్ మిల్లుల్లో భారీ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
X

దిశ, అక్కన్నపేట: మూసివేసిన క్రషర్ మిల్లులే లక్ష్యంగా చేసుకొని, అక్కడి ఖరీదైన యంత్ర సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠాను అక్కన్నపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇనుప వస్తువులు, మోటార్లు, హౌసింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గత కొంతకాలంగా మూసివేసిన క్రషర్ మిల్లుల్లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో అక్కన్నపేట ఎస్సై (SI) ప్రశాంత్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రషర్‌లలో మోర్టర్ లు , హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలక్ట్రిక్ కేబుల్ వైర్స్ కూడా తామే దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. అనంతరం నిందితులను జుడీషియల్ రిమాండ్ కొరకు తరలించడమైనదని తెలిపారు.

Next Story