54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం.. కళ్లకు గంతలు కట్టుకుని గణపతి తయారీ

by Gugulothu.Kavitha |

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో మట్టి‌తో మూడు అడుగుల గణనాథుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు.

54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం.. కళ్లకు గంతలు కట్టుకుని గణపతి తయారీ
X

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో మట్టి‌తో మూడు అడుగుల గణనాథుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని ఆయన హైదరాబాద్‌ కుషాయిగూడ చక్రిపురం ప్రాంతంలోని తన శిల్పకళ వర్క్‌షాప్‌లో రూపొందించారు. కళ అనేది కేవలం చేతి వృత్తి మాత్రమే కాదు, అది భక్తి, మంచి భావాలు, మనసును హత్తుకునే అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. నేటి యువత, పెద్దలు, పిల్లలు – తమ వృత్తుల్లో ఒత్తిడికి గురయ్యే వారందరూ కళను అభ్యసించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చని శిల్పి అన్నారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. “పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అందరూ మట్టి గణపతులను ఉపయోగించాలని” శిల్పి హోతి బస్వరాజ్ పిలుపునిచ్చారు.

Next Story