కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి : వంటేరు ప్ర‌తాప్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయని ఎఫ్ డిసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ కు రోజులు దగ్గరపడ్డాయి : వంటేరు ప్ర‌తాప్ రెడ్డి
X

దిశ, జగదేవపూర్: కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయని ఎఫ్ డిసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగదేవపూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ గా గెలుపొందిన సర్పంచ్ జ్యోతి మహేష్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ప్రతాప్ రెడ్డి కొత్తపేట సర్పంచ్ కు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పరిపాలనలో పేదలకు ఓరగబెట్టింది ఏం లేదని దుయ్యబట్టారు.నూతన సర్పంచులుగా గెలిచినవారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనిని పార్టీ తరపున గెలిచిన సర్పంచులు ఎవరు కూడా అధైర్య పడకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ అందించాలని కోరారు. నూతనంగా గెలిచిన బీఆర్ఏస్ సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తీసుకెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఇటిక్యాల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, జగదేవపూర్ మాజీ ఎంపీటీసీ కొత్త కవితా శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు , సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story