- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం’: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
by Kodari Anjali |
దేవాలయాల నిర్మాణాలకు తనవంతు సహకారం ఎల్లపుడు ఉంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.

X
దిశ, జిన్నారం: దేవాలయాల నిర్మాణాలకు తనవంతు సహకారం ఎల్లపుడు ఉంటుందని, ప్రజల్లో భక్తి భావం పెంపొందించడంలో ఆలయాలు తోడ్పడుతున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సుందర రామచంద్ర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన, రామ్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన దేవాలయాల నిర్మాణాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. దేవాలయాలు సమాజానికి శాంతి, ఐక్యతను అందించే ముఖ్య కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఛైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






