నీకు నేనున్నా తల్లి.. బాగా చదువుకో

by Bhanu |   (  Updated:2025-12-07 11:12:19  IST  )

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి మాజీ మంత్రి హరీష్ రావు చేయూత అందించారు. కోర్సు పూర్తి అయ్యే వరకు ఫీజు చెల్లిస్తానని హామీ నిచ్చారు.

నీకు నేనున్నా తల్లి.. బాగా చదువుకో
X

దిశ, సిద్దిపేట అర్బన్: ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి మాజీ మంత్రి హరీష్ రావు చేయూత అందించారు. కోర్సు పూర్తి అయ్యే వరకు ఫీజు చెల్లిస్తానని హామీ నిచ్చారు. సిద్దిపేట పట్టణానికి చెందిన పెర్క శ్రీనివాస్ చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీనివాస్ కూతురు శ్రీజ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మిట్టపల్లి రెసిడెన్షియల్‌లో చదువుకుంది. డాక్టర్ కావాలనే ఆశయంతో నీట్‌లో ర్యాంక్ సాధించింది. వైద్య విద్య చదివించడానికి స్తోమత లేక పోవడంతో తండ్రి శ్రీనివాస్ మాజీ మంత్రి హరీష్ రావును కలిసి కూతురు వైద్య విద్య కోసం సాయం చేయాలని కోరాడు. ఈమేరకు మొదటి సంవత్సరానికి అయ్యే కళాశాల ఫీజు రూ.60 వేలు శ్రీజకు అందించి, వైద్య విద్య పూర్తి అయ్యే వరకు తానే ఫీజు చెల్లిస్తా అని హామీ నిచ్చారు. హరీష్ రావు భరోసానివ్వడం పెర్క శ్రీనివాస్, శ్రీజ సంతోషం వ్యక్తం చేసారు.

Next Story