- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లాదుర్గం బట్టి కుంట చెరువుకు గండి, పరిశీలన
ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం అల్లాదుర్గం చేరుకొని బట్టికుంట చెరువును సందర్శించారు.

దిశ, అల్లాదుర్గం: ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి సోమవారం అల్లాదుర్గం లోని బట్టికుంట చెరువు కట్ట తెగి దిగువన ఉన్న పంట పొలాలు నష్టం వాటిల్లింది.ఈ సమాచారం తెలుసుకున్న ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంగళవారం అల్లాదుర్గం చేరుకొని బట్టికుంట చెరువును సందర్శించారు. దాంతో పాటు నీటి ప్రవాహంతో ధ్వంసమైన రోడ్డును, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు.వెంటనే ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించి చెరువు కుంటను, ధ్వంసం అయిన రోడ్డు ను మరమత్తులు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సింలు మండల నాయకులు అంజి యాదవ్ ,దశరథ్,సూర్యకుమార్,మోహన్ రాథోడ్,రవి,లతీఫ్, నర్సప్ప, కాజీమ్ తదితరులు పాల్గొన్నారు.






