రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా.. హరీష్ రావు మాస్ వార్నింగ్..!

by Bhanu |   (  Updated:2025-12-07 12:42:44  IST  )

మక్కల మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా.. హరీష్ రావు మాస్ వార్నింగ్..!
X

దిశ, చిన్నకోడూరు: మక్కల మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తే డబ్బులు చెల్లించవా అని ప్రశ్నించారు. మక్కలు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెక్కలు మక్కలు పండిస్తే నేటికీ డబ్బులు చెల్లించ లేదన్నారు. చిన్నకోడూరులో 450 మంది రైతులు 59 రోజుల నుండి 45 కోట్లు చెల్లించలేదు అన్నారు. రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం అంటున్నారు. కానీ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి కొనుగోలు చేసిన రెండు రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి 50 రోజులు అయిన డబ్బులు చెల్లించలేదన్నారు. యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతున్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్ల డబ్బులు విడుదల చేయాలిని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చీరెలు ఇచ్చింది అన్నారు.రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇచ్చి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి అంటే మహిళలకు బకాయి పడ్డ 60వేల డబ్బులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు బోనస్ పడాలి అంటే కాంగ్రెస్‌ను ఓడించాలన్నారు. వచ్చే ఏడాది నుండి పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

నేటికి పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కాళేశ్వరం కూలిందని, కేసీఆర్ హరీష్ రావులను బండకేసి కొట్టాలన్న రేవంత్ రెడ్డి మాటలపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా.. రంగనాయక సాగర్‌లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా.. నువ్వు మునుగుతవో.. తెలుతావో చూద్దాం అన్నారు. రంగనాయక సాగర్‌లో నీళ్లుండి నువ్ మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు.. నువ్వు తెలితే కాళేశ్వరం కూలినట్టు అన్నారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చిల్లర మాటలు మానుకోవాలి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సొసైటీ చైర్మన్లు సదానందం గౌడ్, కనకరాజు, మాజీ వైస్ ఎంపీపీ కీసర్ పాపయ్య, కామనీ శ్రీనివాస్,బోచబోయిన శ్రీహరి,జంగిటి శ్రీనివాస్, ఇష్టమైన శ్రీనివాస్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

READ MORE ....

తెలంగాణ శాసనసభ పనితీరులో లోపాలున్నాయ్.. స్పీకర్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

Next Story