- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కట్టిపెట్టి.. కొనుగోళ్ల పై దృష్టి పెట్టు : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కట్టిపెట్టి కల్లాల్లోని వడ్లను కోతలు లేకుండా కొనాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు హితవు పలికారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి మాటలు కట్టిపెట్టి కల్లాల్లోని వడ్లను కోతలు లేకుండా కొనాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు హితవు పలికారు. సిద్దిపేట నియోజక వర్గం నారాయణరావు పేట మండల కేంద్రంలో గుండె పోటుతో మృతి చెందిన పల్లెవేని కనకయ్య మృత దేహానికి ఎమ్మెల్యే హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు కనకయ్య మరణం ప్రభుత్వ హత్యే అన్నారు. మరోసారి గెలుస్తా.. తొక్కుతా.. తొండల భాష మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిన ఒక్క మంచి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా మొదలు కొనుగోళ్ల వరకు ఫెయిల్ అయిందన్నారు. అధికారులు మంత్రులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజక వర్గం వెంకటాపూర్ లో నేటికి క్వింటాల్ వడ్ల కొనుగోలు చేయక పోవడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.
చేర్వాపూర్, ఎన్సాన్ పల్లిలో లో ధాన్యం సంచులు చేదలు పట్టిన పరిస్థితి నెలకొందన్నారు. హైదరాబాద్ లో కూర్చొని 90 శాతం వడ్ల కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. 4 ట్రాక్టర్ల వడ్లకు 40 బస్తాల వడ్ల మిల్లర్ కట్ చేయడంతో రైతు కనకయ్య కు మనో వేదనతో గుండె పోటుకు గురై మృతి చెందినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. కోతలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. ప్రతి క్వింటాల్ కు 4-5 కేజీల తరుగు పేరిట రైతుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.






