మంజీరా బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి

by Chintha Aamani |

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఒక గేట్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది.

మంజీరా బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి
X

దిశ, సంగారెడ్డి : ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఒక గేట్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. గురువారం మంజీరా బ్యారేజీకి ఇన్ ఫ్లో 7 వేల క్యూసెక్కులు రాగా అదే స్థాయిలో రెండు గేట్లు ఎత్తి ఔట్ ఫ్లో 7 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. కాగా బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు ఉంది.

Next Story