- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టుకు గుంపుగా తిరుగుతున్న ఈగలు.. అనుమానమొచ్చి చూడగా బాత్రూంలో కుళ్లిన శవం
బాత్రూంలో సెక్యూరిటీ గార్డ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలో జరిగింది.

దిశ, నర్సాపూర్: మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భోజ్యతాండ గ్రామపంచాయతీ పరిధిలో ఓ సెక్యూరిటీ గార్డ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, పంచాయతీ కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. భోజ్యతాండ గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణ డంపింగ్ యార్డ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి బాత్రూం సమీపంలోని చెట్టుకు ఈగలు గుంపుగా తిరుగుతుండటం గమనించి అనుమానం వచ్చి వెంటనే బాత్రూం తలుపు తెరిచి చూడగా లోపల కుళ్ళిపోయిన మగ శవం కనిపించింది.
ఆత్మహత్యా లేదా హత్యా..?
శవాన్ని పరిశీలించగా నడుముకు ఉన్న బెల్ట్ ఆధారంగా అది శివశక్తి కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డ్‌దిగా గుర్తించారు. వెంటనే కంపెనీ సెక్యూరిటీ ఇంచార్జిని ఘటనాస్థలానికి పిలిపించి ధృవీకరించగా, మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన దుర్భజ్యోతి బర్వు (40)గా గుర్తించారు. గత రెండేళ్లుగా శివశక్తి కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న అతడిని సుమారు 14 రోజుల క్రితం విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఉద్యోగం నుండి తొలగించినట్లు కంపెనీ సెక్యూరిటీ ఇంచార్జి తెలిపారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఫిర్యాదు మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ సెక్యూరిటీ గార్డుది ఆత్మహత్యా లేదా హత్యా అని స్థానికులు ఉరివేసుకున్న విధానాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






