ఐదు పారామెడికల్ కోర్సు లు ప్రారంభం : Minister Tanniru Harish Rao

by Disha Web Desk 5 |
ఐదు పారామెడికల్ కోర్సు లు ప్రారంభం :  Minister Tanniru Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఐదు బీఎస్సీ పారామెడికల్ కోర్సు‌లు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. బీఎస్సీ అనస్తిషియ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, అప్తో మెట్రిక్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ విభాగాలల్లో ఒక్కో కోర్సులో 10 సీట్ల చొప్పున మొత్తంగా 50 సీట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని మెడికల్ కళాశాల డైరెక్టర్ ని అదేశించినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Read more:

వైద్యశాఖకు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీల్లో 12 కోర్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

Next Story