- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి సిట్ లు.. కేసులు తప్ప రైతుల గోస పట్టదు : మాజీ మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ లు, కేసులు తప్ప రైతుల గోస పట్టదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ లు, కేసులు తప్ప రైతుల గోస పట్టదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు చీకటి తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గించుకోవడానికి కృత్రిమ ఎరువుల సృష్టిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కొరత లేదని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కరోనా వచ్చిన నోట్లు రద్దు అయినా నాట్లు పడే కంటే ముందే రైతు బంధు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. - సీఎం,మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదని మండపడ్డారు. వానకాలం రైతు భరోసా, సన్న వడ్ల బోనస్, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. రైతు భరోసా ఎప్పుడూ ఇస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోయింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూనెగింజలు, పప్పు దినుసుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. అదే సమయంలో రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా ని ఫైర్ అయ్యారు. సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలు, ఘణపురం ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు మొత్తం 70 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించడం దారుణమన్నారు.






