- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిల్లు గేటు వద్ద రైతుల రాస్తారోకో
కొనుగోలు కేంద్రాల నుంచి ట్రక్ చిట్టీలతో మిల్లుకు తరలించిన ధాన్యాన్ని స్వీకరించకుండా మిల్లు యాజమాన్యం నిరాకరించడంతో 2 రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు.

దిశ,దౌల్తాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి ట్రక్ చిట్టీలతో మిల్లుకు తరలించిన ధాన్యాన్ని స్వీకరించకుండా మిల్లు యాజమాన్యం నిరాకరించడంతో 2 రోజులుగా రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. దౌల్తాబాద్ మండలంలోని హైమద్‌నగర్ రైస్ మిల్లు వద్ద బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.రెండు రోజులుగా మిల్లుకు చేరుకున్న ధాన్యాన్ని దిగుమతి చేయకుండా నిలిపివేయడంతో లారీలు, ట్రాక్టర్లు మిల్లు వద్దే నిలిచిపోయాయి. గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్రక్ చిట్టీలు రాసి పంపించినప్పటికీ, మిల్లులో ధాన్యం నిల్వ లక్ష్యం పూర్తయిందని, ఇక ధాన్యం తీసుకోలేమంటూ యాజమాన్యం చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిల్లు గేట్లు మూసివేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం రాశులు పేరుకుపోవడంతో రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయానికి తీసుకొచ్చిన తమకు ఇంకా ఎన్ని రోజులు కష్టాలు తప్పవని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమంటూ రైతులు "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






