అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

by Taduka Kalyani |

అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో ధాన్యం పైన టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచి రైతులు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు.

అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, చేర్యాల: అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో ధాన్యం పైన టార్ఫాలిన్ కవర్లు కప్పి ఉంచి రైతులు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని తాడూరు,చిట్యాల గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 419 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైందని తెలిపారు. అకాల వర్షాలు వర్షాలు నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story