- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా సూచించారు.

దిశ, మర్కుక్ : కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా సూచించారు. మండల కేంద్రం మర్కుక్ లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బుల్లె రాణి మల్లేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు.
రైతుల శ్రమకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ సాయిని మహేష్, మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, నాయకులు బబ్బూరి శ్రీనివాస్, జీవన్ రెడ్డి, గుండా శంకర్, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, మాధవరెడ్డి, రవి, రాజు, కరుణాకర్, పాల్గొన్నారు.






