- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు సీసాలతో రైతుల నిరసన
by velandi.Saikiran |
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆల్వాల గ్రామంలో యూరియా అందక.. మద్యం సీసాలతో రైతులు ఆందోళన చేపట్టారు.

X
దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆల్వాల గ్రామంలో యూరియా అందక.. మద్యం సీసాలతో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి లిక్కర్ అమ్మకాలపై ఉన్న సోయి... రైతులకు యూరియా అందించడంలో లేకపోయే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చెప్యాల ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి యూరియా వస్తుందని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు శనివారం క్యూ లైన్ లో నిలబడ్డారు.
అయినా కూడా ఒక్క బస్తా యూరియా కూడా దొరకక ఆందోళన చేపట్టారు.దింతో మిరుదొడ్డి ఎస్సై సమతా ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ మధ్య యూరియా పంపిణీ చేసారు. అయితే ఇక్కడే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. క్యూ లైన్ లో పెట్టిన జిరాక్స్ పాస్ పుస్తకాలపై ఖాళీ మందు సీసాలు పెట్టి నిరసన తెలిపారు రైతులు. ఇక్కడికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.
Next Story






