మైత్రి డ్రగ్స్ పరిశ్రమపై రైతుల ఆగ్రహం.. డోంట్ కేర్ అంటున్న యాజమాన్యం

by Bhoopathi Nagaiah |

బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ ( Maithri Drugs Industry) పరిశ్రమ వ్యర్థాలను వర్షపు నీటితో కలిపి చుట్టుపక్కల రైతుల పంట పొలాల్లోకి వదులుతున్నారని రైతులు ఆరోపించారు.

మైత్రి డ్రగ్స్ పరిశ్రమపై రైతుల ఆగ్రహం.. డోంట్ కేర్ అంటున్న యాజమాన్యం
X

దిశ, గుమ్మడిదల: బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ ( Maithri Drugs Industry) పరిశ్రమ వ్యర్థాలను వర్షపు నీటితో కలిపి చుట్టుపక్కల రైతుల పంట పొలాల్లోకి వదులుతున్నారని రైతులు ఆరోపించారు. ఏళ్ల తరబడి ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ పరిశ్రమ యాజమాన్యం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బాధిత రైతులు పరిశ్రమ గేటు ముందు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ.. "మైత్రి డ్రగ్స్ పరిశ్రమలోని కెమికల్ రసాయన వ్యర్థాలు తరచుగా తమ పొలాల్లోకి వదులుతున్నారని అన్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి కొనసాగుతుందని తెలిపారు. పలుమార్లు పిసిబి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీటితో కలిసిన రసాయనాలు పంటలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని.. పంటను పండించలేక, జీవనోపాధి నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం చూపేవరకు ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

రైతుల ఆందోళనపై అధికారుల స్పందన

సమస్య గురించి సమాచారం తెలుసుకున్న మండల తహసీల్దార్ పరమేశం, పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులకు నచ్చజెప్పి, సమస్యను తక్షణమే గమనించి తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పిసిబి అధికారులు పరిశ్రమ వ్యర్థాలను స్వీకరించి, రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story