పొలాల్లో.. రైతన్నలు 'బిజి బిజి'

by Taduka Kalyani |

వర్షాకాలం సాగు నేపథ్యంలో.. రైతన్నలు పొలం బాట పట్టారు. కార్తె, ఆరుద్ర లు ముగిసి పెద్ద భాషల ప్రారంభం అవుతున్న క్రమంలో గ్రామాల్లో .. వరి నాట్లు జోరందుకోలేవు భారీ వర్షాలు లేక రైతులు తుకాలు వేసి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

పొలాల్లో.. రైతన్నలు బిజి బిజి
X

దిశ, నిజాంపేట: వర్షాకాలం సాగు నేపథ్యంలో.. రైతన్నలు పొలం బాట పట్టారు. కార్తె, ఆరుద్ర లు ముగిసి పెద్ద భాషల ప్రారంభం అవుతున్న క్రమంలో గ్రామాల్లో .. వరి నాట్లు జోరందుకోలేవు భారీ వర్షాలు లేక రైతులు తుకాలు వేసి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పొలం లోని.. బోరు మోటార్ లలో నీరు పుష్కలంగా ఉన్న రైతులు మాత్రమే వ్యవసాయ పనుల్లో "బిజి, బిజి అయ్యారు." నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 625 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, కందులు వివిధ పంటలను సాగు చేశారు. ఈ వర్షాకాలం అధిక శాతం మంది రైతులు వరి పంటకంటే మొక్కజొన్న పంటపై మక్కువ చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. మొక్క జొన్న సంవత్సర కాలంలో 3 పంటలు తీయొచ్చని రైతులు అంటున్నారు.

సన్నల వైపు చూపు..

రాష్ట్ర ప్రభుత్వం సన్నలు పండించిన రైతులకు బోనస్ లను వేయనున్న సమాచారం తో రైతులు సన్నల వైపు మళ్లారు. దొడ్డు వరి కంటే.. సన్నవరి పై రైతులు మొగ్గు చూపుతూ.. తుకాలు సైతం సిద్ధం చేశారు. ఈ సన్నల కు ప్రోత్సాహకంగా ప్రభుత్వం 500 రూ,, బోనస్ ను కూడా ప్రకటించిన విషయం విధితమే!

తుకాలకు వివిధ రోగాలు

వర్షాకాల ప్రభావమా! ఎండల తీవ్రత సమస్యనో! తెలియదు. కానీ రైతులు వేసిన తుకాలకు ఎర్రరోగం, తెలుగు వివిధ రోగాలు అంటుకున్నాయి. దీనివల్ల తుకం ఎర్రగా మారుతుంది. ఎదగడం లేదు. ఈ సమస్య ఏంటో! తెలియక తుకానికి జింక్, భూ మిక్స్ రోగ నిరోధక మందులను పిచ్ కారి చేస్తున్నారు.

భూ.. గర్భ జలాలు తగ్గాయి.

గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అధికంగా నిండిన విషయం తెలిసిందే.. కాగా వేసవికాలం లో.. ఎండల తీవ్రతలు అధికమవడంతో.. చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా కనుమరుగై పోయాయి. దీంతో భూ..గర్భ జలాలు సైతం తగ్గిపోయాయి. పలువురు రైతుల పొలాల్లో ఉన్న బోరు మోటర్లు తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా మంది రైతులు వర్షాధారం పై ఆధారపడ్డారు.

యూరియా యాప్ కష్టాలు!

యూరియా యాప్ తో.. అవగాహన లేని రైతులకు యూరియా ఎలా? బుక్ చేసుకోవాలని, అనే సందేహాలు మొదలయ్యాయి. ఇతరుల వద్దకు వెళ్ళి లేదా వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్ళి యూరియా బుక్ చేసుకుంటున్నారు. నిమిషాల్లో యూరియా అయిపోవడం విమర్శలు ఎదురవుతున్నాయి.

అన్ని గ్రామాల్లో.. రైతులకు యూరియా యాప్ పై అవగాహన కల్పిస్తున్నారు.

ఏదీ ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం వరి పంట సాగు అధికంగా ఉండదని, అలాగే రైతులకు ఆయిల్ ఫామ్, లాభదాయకమైన పంటల పై అధికారులు రైతులకు ఎప్పటికీ ఎప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు.

Next Story