విద్యుదాఘాతంతో రైతు మృతి

by Ratna Kumari |

దిశ, కొండపాక : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో అదివారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్సై పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..

విద్యుదాఘాతంతో రైతు మృతి
X

దిశ, కొండపాక : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో అదివారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్సై పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక మండలం కేంద్రానికి చెందిన చేబర్తి ఆంజనేయులు(58) అనే వ్యక్తి నిత్యం వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రోజు వారి మాదిరిగా పోలం పనులకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాస్తు విద్యుత్ తీగ తగిలి షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబం సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు కుటుంబాన్ని పరమార్శించి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

Next Story