- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వైపు తీవ్ర చలి.. మరోవైపు ఎన్నికల వేడి..?
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహిర్ పట్టణంలో శనివారం 7.1 °C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదివారం 11.2 గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు మాత్రం రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ఆదివారం రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జహీరాబాద్ డివిజన్ లోని రాయికోడు 32, ఝరా సంగం 33, జహీరాబాద్ 22, మొగుడంపల్లి 22, కోహిర్ 23 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికల నామినేషన్లు స్వీకరించారు. వివిధ పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపిక వేగవంతం చేస్తున్నారు. కొంతమంది పార్టీల నాయకులు ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. మరికొన్ని పార్టీలు రేసు గుర్రాల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమవుతున్నాయి. ఆదివారం కొంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు అభ్యర్థులకు హెచ్చరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. జిల్లాలోని కోహిర్ పట్టణ కేంద్రంలో అత్యల్పంగా 11.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, గరిష్టంగా అమీన్ పూర్ 18.6°C ఉష్ణోగ్రత నమోదైంది. న్యాల్‌కల్‌లో 11.7°, సిర్గాపూర్‌లో 12.1°, పుల్‌కల్‌లో 13.1°, ఝరాసంగంలో 12.4°, నిజాంపేట–పటాన్‌చేరు ప్రాంతాల్లో 13.2°, జహీరాబాద్–నాగలిగిద్దలో 13.5°, గుమ్మడిదల్లో 13.6°, కందిలో 14.6°, సంగారెడ్డిలో 15.4°, పాశమైలారంలో 16.1°, రాయికోడ్‌లో 13.2°, కిష్టారెడ్డిపేట్‌లో 18.1°, రామచంద్రపురంలో 19.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్ర లో వచ్చిన తుఫాను ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని. తుఫాను తగ్గుముఖం పడితే మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు సరైన సమయానికి మందులు వేసుకోవాలని. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీక్యాప్‌లు ధరించాలి. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య సూచించారు. మొత్తం మీద చలి పెరిగి ఓటర్లను చల్లారిస్తుంటే… ఎన్నికలు మాత్రం ఓటర్లను వేడెక్కిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.






