- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ మద్యంపై ఎక్సైజ్ దాడులు
మండలంలోని రాంపూర్, జేపీ తండా గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

X
దిశ, హుస్నాబాద్ : మండలంలోని రాంపూర్, జేపీ తండా గ్రామాల్లో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై నిఘా ఉంచి, భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడుల్లో 13.6 లీటర్ల మద్యం, 26 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సై రూప, ట్రైనీ ఎస్సై మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






