- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందరూ ముందుకు రావాలి
చేగుంట మండలంలోని బోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ప్లాంట్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

దిశ, చేగుంట : చేగుంట మండలంలోని బోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ప్లాంట్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో స్వచ్ఛమైన తాగునీరు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మినీ వాటర్ ప్లాంట్‌ను దాత రంగయ్యగారి రాజిరెడ్డి ప్రవీణ స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి దాతల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందరూ ముందుకు రావాలని కోరారు. రాజిరెడ్డి ప్రవీణ సేవా భావం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులు పొందాలన్నదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాఠశాలల్లో మినీ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందడంతో పాటు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనాల గ్రామ సర్పంచ్ సుకన్య నాగులు, బి.కొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రాజిరెడ్డి, చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బోనాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకట రమణ, సొసైటీ మాజీ డైరెక్టర్ గణేష్, లచ్చిరెడ్డి, పార్టీ నాయకులు, గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






