- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్క ఓటరును కాపాడుకోవాలి
ఏఐసీసీ, పీసీసీ ఆదేశాలను అనుసరించి ప్రస్తుతం చేపడుతున్న స్పెషల్ ఎంటెన్సీ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఓటరును కాంగ్రెస్ పార్టీకి చెందిన బిఎల్ఎలు కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

కష్టపడ్డ ప్రతి బిఎల్ఏకి మంచి గుర్తింపు ఉంటుంది
ఈ "సర్" కార్యక్రమం ద్వారా బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు అనుకూలించిన ఓట్లను తొలగించే కుట్రలను చేస్తుందని, కార్యకర్తలు దానిని గట్టిగా తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. అయితే వచ్చే జూలై 6న తిరిగి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. కాగా కష్టపడ్డ ప్రతి ఒక్క బిఎల్ఎలకు రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సంగారెడ్డిలో మొత్తం 2,55,243 ఓట్ల సంఖ్య ఉండగా ఇందులో 1,57,643 ఓట్లు "సర్" కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ఇప్పటికే పూర్తయిందని ఇన్చార్జీలు దయాకర్, ప్రీతమ్ లు తెలిపారు. అయితే ఇందులో 97,600 ఓట్లు ఇంకా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదని వారు చెప్పారు. 2002 సంవత్సరంలో నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ జాబితా అనుసారంగా కొత్తగా ఓట్ల సవరణ జరుగుతుందని, 2002లో ఓటరుగా గుర్తింపు పొందిన వారి కుటుంబీకుల ఓట్లను అనుసంధానం చేసి తాజాగా ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బిఎల్ఎలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






