సార్ వచ్చిందే ఆఫీస్ టైం..!

by velandi.Saikiran |

సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్కడి అధికారుల తీరు ఇందుకు నిదర్శనం పడుతుంది.

సార్ వచ్చిందే ఆఫీస్ టైం..!
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొంతమంది అధికారులకు సమయపాలన అనేది లేకుండా పోయింది. వాళ్లు వచ్చిందే ఆఫీస్ టైం అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్కడి అధికారుల తీరు ఇందుకు నిదర్శనం పడుతుంది. ఉదయం 11:30 దాటినా కూడా సంగారెడ్డి సబ్ రిజిస్టర్ శేఖర్ రాలేదు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కార్యాలయంలో ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు.

దీనికి తోడు ఉదయం జిల్లా కార్యాలయానికి పలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు సాయంత్రం దాటాక కూడా వారి పని కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు రాత్రిళ్ళు వరకు వేచి ఉండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడికి వచ్చిన వారు దిశ ప్రతినిధితో మాట్లాడుతూ చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారి స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేలా చూడాలంటూ పలువురు కోరుతున్నారు.

Next Story