ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త : మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎం.అశోక్

by Nallavelli.Anjaneyulu |

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క‌రు తమ వంతు కృషి చేయాలని కోహీర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్ పేర్కొన్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త :  మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎం.అశోక్
X

దిశ, కోహీర్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క‌రు తమ వంతు కృషి చేయాలని కోహీర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్ పేర్కొన్నారు. కోహీర్ పట్టణంలోని లాలకుంట ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రజా పాలన- ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటు వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటలని చూచించారు. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధ అమలుకు కృషి చేయాలన్నారు. క్యారీ బ్యాగ్స్ కి బదులుగా పర్యావరణనికి హాని కలిగించని సంచులు, బస్తాలను వాడాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నాన్ జావీద్, కౌన్సిలర్లు జాజుల శ్రీకాంత్, నాగరిగారి సంపత్ కుమార్, ఐకేపీ సిబ్బంది టీఎంసీ స్వర్ణ కుమారి, లలిత, మంజుల పాల్గొన్నారు.

Next Story