- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల తప్పిదం వల్లే బీసీ వర్గానికి తీవ్ర నష్టం
దిశ, సంగారెడ్డి అర్బన్ : బీసీ రిజర్వేషన్ అమలులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే బీసీ వర్గాలు నష్టపోతున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు

దిశ, సంగారెడ్డి అర్బన్ : బీసీ రిజర్వేషన్ అమలులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే బీసీ వర్గాలు నష్టపోతున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సంగారెడ్డి లోని బీసీ జేఏసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 రెండు శాతం రిజర్వేషన్ వాగ్దానాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు అని చెప్పి బీసీలను మోసం చేశారన్నారు. పాత పద్ధతి రిజర్వేషన్లలోను బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాజకీయ నాయకుల పలుకుబడితో బీసీ వర్గాలను అణిచివేసే విధంగా రిజర్వేషన్ అమలు చేస్తూ కుట్రలు చేశారని ఆన్నారు. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు కాలేదని అందుకు అధికారులు సైతం వత్తాసు పలికారని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యం వలన అర్హులైన అనేకమంది బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు అన్యాయం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి రిజర్వేషన్ల అవకతవకలపై విచారణ జరిపించి, రిజర్వేషన్ ప్రక్రియను పునః పరిశీలించాలని అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బి సి జే ఏ సి వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, కన్వీనర్ సుధాకర్, బీసీ జేఏసీ కో కన్వీనర్ మానస, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి బాషా, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి, శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, పాండు రంగం శ్రీశైలం, కార్యాలయ కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.






