సిగ్గూ శరం లేని కలెక్టర్.. జిల్లాలో పనికి మాలిన మంత్రి ఉన్నాడు.. దుబ్బాక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

by Chintha Aamani |

మెదక్ జిల్లా కలెక్టర్ పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు

సిగ్గూ శరం లేని కలెక్టర్.. జిల్లాలో పనికి మాలిన మంత్రి ఉన్నాడు.. దుబ్బాక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా కలెక్టర్ పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌లనే కాంగ్రెస్ కార్యకర్తలులాగా, సిగ్గు శరం లేకుండా అంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా కలెక్టర్ గురించి తప్పక మాట్లాడాల్సిందే అన్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తల మాదిరిగా గాంధీ భవన్ నుంచి రాసి పంపే ఇంత పెద్ద స్క్రిప్ట్ చదువుతాడని అన్నారు. కనీసం నఖల్ కొట్టేందుకు అఖల్ వాడాలన్నారు. చదివే దాంట్లో మన వాటిని కూడా చదువుతున్నాడని, ఇలాంటి వాడు కూడా ఉన్నాడని అన్నారు. ఇలా కలెక్టర్ సిగ్గు శరం లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. పోలీస్ ల గురించి కూడా చెప్పాల్సిన పనిలేదని, ఎమ్మెల్యేలకు ఎస్కార్టు ఉందని, కాంగ్రెస్ నేతలకు మాత్రం రెండు మూడు వాహనాలు పెడుతున్నారని ఆరోపించారు.

జిల్లాలో పనికి మాలిన మంత్రి...

జిల్లాలో పనికి మాలిన మంత్రి ఉన్నాడని, కమిషన్ లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చుని వసూల్ చేస్తుందని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో మంత్రి ఒకరు ఉంటే పెత్తనం మరో మంత్రిదన్నారు. ఇక్కడ ఉండడు పని చేయడు.. వాడికి జిల్లా గురించి తెలియదని విమర్శించాడు. జిల్లాలో ఉన్న సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ ల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. అంతా కమిషన్ లు పంచుకుంటున్నారని జగ్గారెడ్డి ఏడుస్తున్నాడని అన్నారు. ఆ కన్నీరే దో రైతుల కోసం పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.

Next Story