సిద్ధా గౌడ్ మృతిపై పలువురి సంతాపం

by Ratna Kumari |

దిశ, మెదక్ ప్రతినిధి : రాయిన్ పల్లి మాజీ సర్పంచ్ సిద్ధా గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందాడు. సిద్ధ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్

సిద్ధా గౌడ్ మృతిపై పలువురి సంతాపం
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాయిన్ పల్లి మాజీ సర్పంచ్ సిద్ధా గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందాడు. సిద్ధ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ దేవేందర్ రెడ్డి, రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొని సిద్ద గౌడ్ భార్య లక్ష్మిని, అన్న అంజి గౌడ్ ను ఓదార్చి మనోధైర్యాన్ని చెప్పారు. ఆకస్మికంగా కుటుంబ సభ్యుడినీ కోల్పోవడం చాలా బాధాకరమని అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్బంగా సిద్ధ గౌడ్ సర్పంచ్ గా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. వీరివెంట జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, నాయకులు కొత్తపల్లి, కిష్టయ్య, యాదగిరి, మైస గౌడ్, గ్రామస్తులు ఉన్నారు.

Next Story