డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి

by Ratna Kumari |

అంచనాలు పూర్తైన‌ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున వినతిపత్రం అందజేశారు.

డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి
X

దిశ‌, సంగారెడ్డి అర్భ‌న్ : అంచనాలు పూర్తైన‌ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీలో వివిధ వార్డులలో డ్రైనేజీ పనుల కోసం గతంలో వచ్చిన ప్రజల వీడియో విజ్ఞప్తులను పరిశీలించి, అంచనాలు పూర్తైన‌ డ్రైనేజీ మురుగు కాల్వ ల కు నిధులు మంజూరు చేసి, టెండర్ పూర్తి చేసి వెంటనే డ్రైనేజీ పనులు చేపట్టాలని అన్నారు. మున్సిపాలిటీలో ని 15వ వార్డు రాజంపేట కాలనీ, 34వ వార్డు ఇందిరా కాలనీ, 33వ వార్డు రాజీవ్ గృహ కల్ప కాలనీ ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన వినతులకు డ్రైనేజీ పనుల అంచనాల పూర్త‌యిన‌ వాటిని వెంట నే టెండర్ లు పిలిచి డ్రై నేజి పనులు చేపట్టాలని వినతిపత్రం లో కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ధన్నారం మల్లేశం, పట్నం సతీష్ కుమార్, దొర్తల సుమన్, అనిల్, టేకుల ఆగమయ్య పాల్గొన్నారు.

Next Story