ఉన్న‌త హోదాలో ఉన్నార‌ని ఏది ప‌డితే అది మాట్లాడొద్దు : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన రైతు భరోసా, పంట బోనస్, రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నారని.. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు.

ఉన్న‌త హోదాలో ఉన్నార‌ని ఏది ప‌డితే అది మాట్లాడొద్దు : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
X

దిశ, కంగ్టి : కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన రైతు భరోసా, పంట బోనస్, రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నారని.. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. గురువారం మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజులపాడ్ గ్రామానికి చెందిన రైతు మాధవ్ రావు పాటిల్ మృతి చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతుల మరణాలపై రాజకీయ ఆరోపణలు చేయడం కంటే, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలన్నారు.

తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఇక్కడికి వచ్చి గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. విమర్శలు చేసే ముందు ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల ఏమి చేస్తుందో ఆలోచించాలని సూచించారు. పెద్ద హోదాలో ఉన్నానని భావించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు భయపడరని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, హామీల అమలులో ఆలస్యం జరుగుతోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు సమయానికి సహాయం, మద్దతు ధరలు, రుణమాఫీ వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి తక్షణ పరిహారం ప్రకటించి, ప్రభుత్వ సహాయాన్ని అందించాలని కోరారు.

Next Story