ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు

by Taduka Kalyani |

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూసుకోవాలని, తేమ శాతం వచ్చిన వరి ధాన్యం వెంటనే లిఫ్ట్ చేయని అధికారులను ఆదేశించారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
X

దిశ, చేర్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూసుకోవాలని, తేమ శాతం వచ్చిన వరి ధాన్యం వెంటనే లిఫ్ట్ చేయని అధికారులను ఆదేశించారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. ఆదివారం చేర్యాల మండల పరిధిలోని వీరన్నపేట, మద్దూరు మండలం సల్కాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి ట్రాక్టర్ల లో నింపి కేటాయించిన మిల్లులకు తరలించాలని, మిల్లుల్లో జాప్యం కాకుండా, ఒక సెంటర్ కు రెండు లేదా మూడు మిల్లులను కేటాయించాలని అన్నారు. సెంటర్లో ప్యాడీ క్లీనర్లు,వెయిట్ మిషన్సు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Next Story