- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
road problem : దిశ ఎఫెక్ట్...కానుకుంటా రోడ్డు సమస్యపై కలెక్టర్ సీరియస్
గుమ్మడిదల మండల కేంద్రం నుంచి కానుకుంట వరకు అస్తవ్యస్తంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డుపై దిశ దినపత్రిక కథనం ప్రచురించింది.

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మండల కేంద్రం నుంచి కానుకుంట వరకు అస్తవ్యస్తంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డుపై దిశ దినపత్రిక కథనం ప్రచురించింది. వామ్మో కానుకుంటా రోడ్డు పేరుతో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యని వెలుగులోకి తీసుకొచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. రోడ్డు డ్యామేజీ తో పాటు పనులు ఆగిన వ్యవహారంపై ఆర్ అండ్ బీ అధికారులను పూర్తి నివేదిక కోరుతూ విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి ఆదేశాలతో ఆర్ అండ్ బీ అధికారులు కానుకుంట రోడ్డుకు సంబంధించిన పూర్తి నివేదిక అందచేశారు. కానుకుంట సింగిల్ రోడ్డు పునర్నిర్మాణానికి 2022 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం రూ.1.48 కోట్ల నిధులు మంజూరు
చేసి జూన్ 2023 లో విజయ సాయి ఇంజనీర్స్ డెవలపర్స్ సంస్థకి టెండర్ ప్రక్రియ ద్వారా నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ పనులు మొదలు కావాల్సి ఉండగా నవంబర్ 2023 లో గుమ్మడిదల నుంచి కానుకుంట వరకు డబుల్ లైన్ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోడ్ తో పాటు కొన్ని ఇతర కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. కేవలం సింగల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో డబుల్ రోడ్డు
నిర్మాణానికి నిధుల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ రోడ్డు నిర్మాణ విషయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా రోడ్డు నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని అధికారులు వెల్లడించారు. అయితే రోడ్డు నిర్మాణాల పనులలో జాప్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే యుద్ధ ప్రతిపాదికన పనులు మొదలుపెట్టి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ సీరియస్ అవ్వడంతో ఆగిన రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
- Tags
- road problem






