- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు
by Ratna Kumari |
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్, చిలేపల్లి గ్రామ శివారులో నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం జరుగుతున్న తవ్వకాల సమయంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు జేసీబీ

X
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్, చిలేపల్లి గ్రామ శివారులో నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం జరుగుతున్న తవ్వకాల సమయంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు జేసీబీ తగలడంతో లీక్ ఏర్పడి మూడు రోజుల పాటు నీరు వృథాగా వదులుగా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సోమవారం దిశ దినపత్రికలో “పగిలిన పైప్‌లైన్ (నిమ్జ్‌లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు)” అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు, గుత్తేదారులు స్పందించి వెంటనే పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. మంగళవారం మరమ్మతులు పూర్తి చేసి, బుధవారం నుంచి వివిధ గ్రామాలకు నీటి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో నీటి సమస్య తీరడంతో పరిసర గ్రామాల ప్రజలు దిశ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






