- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్... చెలిమెల కుంటలో అక్రమ నిర్మాణాల తొలగింపు
by Sridhar Babu |
మండల పరిధిలోని దౌల్తాబాద్ దౌలాపూర్ గ్రామాల మధ్య ఉన్న చెలిమెల కుంట కబ్జా అనే శీర్షిక దిశ మొదటి పేజీలో ప్రచరించిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు.

X
దిశ, హత్నూర : మండల పరిధిలోని దౌల్తాబాద్ దౌలాపూర్ గ్రామాల మధ్య ఉన్న చెలిమెల కుంట కబ్జా అనే శీర్షిక దిశ మొదటి పేజీలో ప్రచరించిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణమైన రేకుల షెడ్డులు తొలగించారు. ఈ సందర్భంగా మండల ఇరిగేషన్ శాఖ అధికారి భూపుత్ర మాట్లాడుతూ చెలిమెల
కుంట కబ్జా చేసిన విషయం వాస్తవమని, కుంటలో రేకుల షెడ్డును నిర్మాణం చేసి కబ్జా చేసిన విషయం గుర్తించినట్లు తెలిపారు. కబ్జా చేసి నిర్మించిన రేకుల షెడ్డును తొలగించామని అన్నారు. కుంటలు, చెరువులు కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో కుంటలు, చెరువులు కబ్జా కు గురవుతే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
- Tags
- Disha effect.
Next Story






