- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. యూరియా అక్రమ రవాణా పై కేసు నమోదు
చేర్యాల మండల కేంద్రంలో రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియాను అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్నారంటూ ఈ నెల 21న "పక్కదారి పడుతున్న యూరియా" శీర్షికతో ప్రచురితమైన కథనంపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

దిశ, చేర్యాల: దిశలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. చేర్యాల మండల కేంద్రంలో రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియాను అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్నారంటూ ఈ నెల 21న "పక్కదారి పడుతున్న యూరియా" శీర్షికతో ప్రచురితమైన కథనంపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. సిద్ధిపేట జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు చేర్యాల ఏడీఏ రాధిక, ఎంఏవో భోగేశ్వర్ ఫిర్యాదు చేయగా, చేర్యాల పోలీసులు మండల కేంద్రంలోని సాయి శివ ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులను తనిఖీ చేశారు. తనిఖీల్లో దుకాణ యజమాని సందీప్ రెడ్డి యూరియా నిల్వల విషయంలో అవకతవకలకు పాల్పడి రూ.17,10,144 విలువైన 6,429 సబ్సిడీ యూరియా బస్తాలను దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే యూరియా దారి మళ్లింపులో శ్రీ ఫర్టిలైజర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ డీలర్ల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైతులకు సబ్సిడీ ధరకు విక్రయించాల్సిన యూరియాను కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అలాంటి ఫర్టిలైజర్ దుకాణాలపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






