- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్...ఉపాధ్యాయుల సర్దుబాటులో పారదర్శక ఉండాలి
ఉపాధ్యాయుల సర్దుబాటు లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ విద్యా శాఖ అధికారాలను ఆదేశించారు.

దిశ, మెదక్ ప్రతినిధి : ఉపాధ్యాయుల సర్దుబాటు లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ విద్యా శాఖ అధికారాలను ఆదేశించారు. దిశ పత్రికలో ఈ నెల 14 రండి సార్ రండి అంటూ ఉపాధ్యాయుల డిప్యూటేషన్ లలో ఆఫర్ లు ఇస్తున్నారంటూ కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయ సంఘాలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దృష్టికి పలు ఉపాధ్యాయ సంఘాలు తీసుకు వెళ్ళి ప్రలోభాలు సాగుతున్నట్టు వచ్చిన ఆరోపణల పై వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ విద్యా శాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ ఎక్కడ ఉపాధ్యాయ అవసరం ఉంది.. ఎక్కడ అధికంగా ఉన్నారో పక్కగా గుర్తించి జీవో ప్రకారమే సర్దుబాటు చేయాలని ఆదేశించారు. డిప్యూటేషన్ లో అలాంటి పొరపాట్లు, ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలని సూచించారు. జీవో కు విరుద్ధంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. పత్రికలో వచ్చిన కథనం వల్లే జిల్లా అధికారులు స్పందించి పారదర్శకంగా ఉపాధ్యాయుల సర్దుబాటు కు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.






