గీతంలో భారత సాహిత్య సంస్కృతులపై చర్చాగోష్ఠి

by Nallavelli.Anjaneyulu |

పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశాలపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిని గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.

గీతంలో భారత సాహిత్య సంస్కృతులపై చర్చాగోష్ఠి
X

దిశ, పటాన్ చెరు టౌన్ : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో సాహిత్య సంస్కృతులు, సామాజిక-రాజకీయ ఉద్యమాలు’ అనే అంశాలపై నిర్వహిస్తున్న రెండు రోజుల చర్చాగోష్ఠిని గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. భారతీయ సాహిత్యం, భావజాలం, సంస్కృతి, సామాజిక పరివర్తన, విమర్శనాత్మక వంటి అంశాలపై చర్చించేందుకు దేశ నలుమూలల నుండి ప్రముఖ పండితులు, విద్యావేత్తలను, ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ చర్చ గోష్టిలో అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, ఎస్.ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాలకు చెందిన డాక్టర్ అమన్ దీప్ కౌర్, డాక్టర్ జగ్వీర్ సింగ్ లతో పాటు గీతం అధ్యాపకుడు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్ లు పాల్గొని ప్రసంగించారు. 1872 నాటి ఒక తెలుగు నవల’ అయిన ‘కులాన్ని పున:నిర్వచించడం అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ అల్లాడి ఉమ, ప్రొఫెసర్ ఎం.శ్రీధర్ లు కీలకోపన్యాసాలు చేశారు. ఒక నవల ఒకే సమయంలో కల్పితంగా, చారిత్రకంగా ఎలా ఉండగలదో వారు వివరించారు. శతాబ్దాలుగా ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థను అది చిత్రించడంలో ఒక చారిత్రకత ఉందని, అయితే శ్రీరంగరాజు అనే విజయనగర రాజు లేకపోవడంలో దాని కల్పిత అంశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. సోనాబాయి ఒక లంబాడా అమ్మాయి నుంచి నాయక కుటుంబ సభ్యురాలిగా మారడం కూడా వాస్తవికతను కల్పితంగా పునర్నిర్మించడాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఆమె లంబాడా మహిళగానే ఉండి ఉంటే, ఆనాటి కుల వివక్షతో నిండిన సమాజం ఈ నవలను అంగీకరించి ఉండేది కాదన్నారు. హిందూ సమాజ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న కులం, గిరిజన దృక్కోణాల ద్వారా శ్రీరంగనాథ చరితము వంటి గ్రంథాలను పున:పరిశీలించాల్సిన అవరం ఎంతైనా ఉందన్నారు. ‘వలసవాద, స్థానిక సంస్కృతులలో లైంగికత, నైతిక ఆందోళన’ అనే అంశాలపై గీతం ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ తో పాటు దేశ నలుమూలల నుండి హాజరైన ప్రసిద్ధి ప్రొఫెసర్లు తమ ప్రసంగాలను అందించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సింపోజియం భారతదేశంలో సామాజిక-సాంస్కృతిక, సాహిత్య ఆధునికత వంటి పరిణామ స్వభావాన్ని, పరివర్తన చెందుతున్న విధానాన్ని చాటి చెప్పేందుకు ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

Next Story