- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, చేగుంట: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన చేగుంట మండల పరిధిలో జరిగింది. ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతసాగర్ గ్రామానికి చెందిన చిక్కుడు నరేష్ తన తండ్రి ఆంజనేయులుతో అప్పుడప్పుడు గొడవపడేవాడు. ఇటీవల కాలంలో గొడవపడగా గ్రామ పెద్దలు సర్ది చెప్పి గొడవ సద్దుమణుగేలా చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ నెల 26వ తేదీన నరేష్ భార్య సింధుజ తల్లి గారి ఇంటికి వెళ్లగా తండ్రితో మరోసారి గొడవపడిన నరేష్ ఈ నెల 28వ తేదీ నుంచి కనబడకుండా పోయాడు. విషయం తెలిసిన భార్య సింధుజ బంధువులతో, పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ తెలియలేదు. నరేష్ ఫోన్ సైతం స్విచ్ఛాప్ ఉంది. దీంతో గురువారం భార్య సింధూజ చేగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






