భార్యాభర్త అదృశ్యం

by Sridhar Babu |
భార్యాభర్త అదృశ్యం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ కు చెందిన నాగయ్య, సురేఖ భార్య భర్తలు. ఈనెల 21న తమ కొడుకు, కోడలు సాయి కుమార్, స్వర్ణలత గొడవపడ్డారు. వీరిని ఆపేందుకు వెళ్లిన నాగయ్యను కొడుకు సాయి కుమార్ తండ్రిపై తీవ్రంగా కోపగించుకున్నాడు.

దీంతో మనస్థాపం చెందిన భార్యాభర్తలు ఈనెల 22న ఉదయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలిసినవారు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ 08455-276333, లేదా పట్టణ సీఐ 8712656718 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Next Story