- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైతరలో ఉద్రిక్తత.. న్యాయం చేయాలని మృతుడి కుటుంబీకుల ఆందోళన
దిశ, (కొల్చారం): మంజీరా నదిలో నీట మునిగి యువకుడు మృతి చెందడంతో కొ

X
దిశ, (కొల్చారం): మంజీరా నదిలో నీట మునిగి యువకుడు మృతి చెందడంతో కొల్చారం మండలం పైతర గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం పైతర శివారులోని మంజీరా నది నీటి మడుగులో నుంచి మోటర్ తీయడానికి వెళ్లిన యువకుడు పుట్టి మల్లేశం (35) మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మల్లేశం మృతికి కారణమైన వ్యక్తుల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అతని కుటుంబీకులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మల్లేశం మృతికి కారణమైన వ్యక్తులను శిక్షించే వరకు గ్రామం నుండి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకూడదని మృతుని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో కొల్చారం పోలీసులు గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






