అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్‌కు బలమైన ఆయుధం

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను విస్తృతంగా ఆకర్షిస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్‌కు బలమైన ఆయుధం
X

దిశ, ములుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలను విస్తృతంగా ఆకర్షిస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన చేరికల కార్యక్రమంలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిక్కాల ఇంద్రసేనారెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇంద్రసేనారెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ చేరికతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే తిప్పని విజయసింహ రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రెడ్డి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెళ్లి విజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story