- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోళ్లలో జాప్యం.. వర్షానికి తడిసి మొలకెత్తిన జొన్నలు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జాంగ్గి(బి) గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జాంగ్గి(బి) గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం ఒక లారీ జొన్నలనే కొనుగోలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని పలువురు రైతుల జొన్నలు కొనుగోలు కేంద్రాలు , రైతు వేదిక వద్దే నిలిచిపోయాయి. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతులకు మరింత నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కోసం కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన జొన్నలు పూర్తిగా తడిసిపోగా, కొన్ని చోట్ల మొలకలు కూడా రావడం ప్రారంభమైంది. దీంతో పంట నాణ్యత దెబ్బతింటోందని, మరింత ఆలస్యం జరిగితే భారీ ఆర్థిక నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో బస్తాల కొరతతో పాటు ఇతర కారణాలను చూపుతూ కొనుగోళ్ల ప్రక్రియను నత్తనడకన సాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా వందలాది క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు కోసం ఎదురుచూస్తూ కేంద్రాల వద్దే నిల్వ ఉండిపోయాయని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షానికి తడిసి, మొలకెత్తుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని, వర్షానికి తడిసిన జొన్నలను కూడా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు






